Araku Coffee Stalls: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:13 PM
పార్లమెంట్ భవన్‌లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభమయ్యాయి. లోకసభ కాంటీన్‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ ప్రారంభించారు. రాజ్యసభ కాంటీన్‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు.

న్యూఢిల్లీ: అరకు కాఫీ (Araku Coffee)కి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ (Parliament)లో సోమవారం ఉదయం అరకు కాఫీ స్టాల్స్ (Coffee Stalls) ఏర్పాటు అయ్యాయి. సభాపతి ఆదేశంతో రెండు స్టాల్స్ ఏర్పాటుకు లోకసభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా (Kul Mohan Singh Arora) ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ఈనెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం కాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసింది. లోకసభ కాంటీన్‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ ప్రారంభించారు. రాజ్యసభ కాంటీన్‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.
Also Read..: ABN Live..: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ..
పార్లమెంట్‌లో అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్ సోమవారం ఏర్పాటు అయ్యాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తూర్పు కనుమల నుండి భారత దేశ పార్లమెంట్ వరకు అరకు వ్యాలీ కాఫీ ప్రస్థానం దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ రాష్ట్ర గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతుందని, వారి స్వహస్తాలతో పండించిన కాఫీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నిలయమైన భారత పార్లమెంట్‌లో ఎంపీలు అందరినీ అమోఘమైన రుచితో మైమరపించబోతుందన్నారు. ఈ స్టాల్స్‌ను కేంద్ర మంత్రులు.. ప్రారంభం చేయడం సంతోషంగా సంతోషంగా ఉందని కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సంధ్యా రాణి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,కమ్యునికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని, ఏపీ కూటమి ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంచి శకునాల్లో మొదటిది ఏంటంటే..
వాకింగ్ తర్వాత ఈ పొరపాట్లు చేయకండి
For More AP News and Telugu News