Share News

దీపం-2 రెండో ఉచిత సిలిండర్‌కు బుకింగ్‌ ప్రారంభం

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:45 AM

దీపం-2 పథకం కింద రెండో విడత ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని జేసీ జాహ్నవి తెలిపారు. జూలై ఒకటో తేదీ వరకు సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అక్టోబరు 29 నుంచి మార్చి 31 వరకు తొలివిడత ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్న వారి బ్యాంకు ఖాతాల్లో రూ.24,79,82,364 జమ అయ్యాయని తెలిపారు.

దీపం-2 రెండో ఉచిత సిలిండర్‌కు బుకింగ్‌ ప్రారంభం

అనకాపల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): దీపం-2 పథకం కింద రెండో విడత ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని జేసీ జాహ్నవి తెలిపారు. జూలై ఒకటో తేదీ వరకు సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అక్టోబరు 29 నుంచి మార్చి 31 వరకు తొలివిడత ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్న వారి బ్యాంకు ఖాతాల్లో రూ.24,79,82,364 జమ అయ్యాయని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తుందని అన్నారు. వినియోగదారులు నగదు చెల్లించి సిలిండరు తీసుకున్న 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. పథకం అమలులో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్‌ ఫ్రీ నంబరు 1967 లేదా ఆయిల్‌ కంపెనీల కాల్‌ సెంటర్‌ 1800 2333555 నంబర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని జేసీ పేర్కొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:45 AM