పాడేరులో విభిన్న వాతావరణం
ABN , Publish Date - Apr 18 , 2025 | 10:32 PM
వాతావరణంలోని మార్పులతో గతకొన్ని రోజులుగా ఏజెన్సీలో ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కమ్మేస్తున్నది.
ఉదయం 8 గంటల వరకు పొగమంచు
తర్వాత మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ
పాడేరులో 36.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
పాడేరు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలోని మార్పులతో గతకొన్ని రోజులుగా ఏజెన్సీలో ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కమ్మేస్తున్నది. అలాగే శుక్రవారం సైతం ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు కురిసింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. అయితే పొగమంచు కమ్మినా ఎండ ప్రభావం మాత్రం తగ్గడం లేదు. దీంతో శుక్రవారం పాడేరులో 36.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఒక్కోరోజు మధ్యాహ్నం నుంచి వర్షం కురిసినా గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడడం లేదు.
పాడేరులో 36.5 డిగ్రీలు
ఏజెన్సీలో శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా కేంద్రం పాడేరులో 36.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అరకులోయలో 35.5, కొయ్యూరులో 35.1, పెదబయలులో 34.9, డుంబ్రిగుడలో 33.5, ముంచంగిపుట్టులో 32.4, హుకుంపేటలో 32.3, చింతపల్లిలో 31.4, అనంతగిరిలో 31.3, జి.మాడుగులలో 30.8, జీకేవీధిలో 29.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.