Share News

విద్యార్థులకు ఎక్స్‌పోజర్‌ విజిట్స్‌

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:13 AM

ప్రాథమిక విద్యా విధానంలో ప్రభుత్వం సరి కొత్త ఒరవడికి నాంది పలికింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ‘ఎక్స్‌పోజర్‌ విజిట్స్‌’ పేరుతో సమీపంలోని బ్యాంకులు, సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అగ్నిమాపక కేంద్రాలు, పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేకత సంతరించుకున్న ప్రదేశాలకు తీసుకువెళ్లి... ప్రభుత్వ ఉద్యోగుల హోదాలు, వారి విధులు, అందిస్తున్న సేవల గురించి తెలియజేస్తున్నారు. తరగతి గదిలో పాఠాలు వినడంతోపాటు ఇటువంటి సందర్శనలకు విద్యార్థులను తీసుకువెళ్లి వివరించడం లన వాటి పట్ల అవగాహన, విజ్ఞానం పెరుగుతుందని కూటమి ప్రభుత్వం భావించి కొత్త కాన్సెప్ట్‌ని ప్రవేశ పెట్టింది.

విద్యార్థులకు ఎక్స్‌పోజర్‌ విజిట్స్‌
కశింకోట మండలం బయ్యవరంలోని హెరిటేజ్‌ డెయిరీని సందర్శిస్తున్న ఏఎస్‌పేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు

ప్రాథమిక విద్యలో ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్‌

ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, పోలీసు స్టేషన్లు, పరిశ్రమల సందర్శన

ఉద్యోగుల విధులు, సేవలు, వస్తువుల తయారీపై అవగాహన

తొలి విడత ప్రతీ మండలంలో రెండేసి పాఠశాలలు ఎంపిక

10 మంది చొప్పున 240 మంది ఎక్స్‌పోజర్‌ విజిట్‌

రేపటిలోగా సందర్శన పూర్తిచేయాలని అధికారులు ఆదేశం

నర్సీపట్నం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక విద్యా విధానంలో ప్రభుత్వం సరి కొత్త ఒరవడికి నాంది పలికింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ‘ఎక్స్‌పోజర్‌ విజిట్స్‌’ పేరుతో సమీపంలోని బ్యాంకులు, సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అగ్నిమాపక కేంద్రాలు, పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేకత సంతరించుకున్న ప్రదేశాలకు తీసుకువెళ్లి... ప్రభుత్వ ఉద్యోగుల హోదాలు, వారి విధులు, అందిస్తున్న సేవల గురించి తెలియజేస్తున్నారు. తరగతి గదిలో పాఠాలు వినడంతోపాటు ఇటువంటి సందర్శనలకు విద్యార్థులను తీసుకువెళ్లి వివరించడం లన వాటి పట్ల అవగాహన, విజ్ఞానం పెరుగుతుందని కూటమి ప్రభుత్వం భావించి కొత్త కాన్సెప్ట్‌ని ప్రవేశ పెట్టింది. ప్రతి మండలం నుంచి రెండు పాఠశాలలను ఎంపిక చేసి పది మంది పిల్లలను ఎక్స్‌పోజర్‌ విజిట్‌కి తీసుకు వెళ్లాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో 48 పాఠశాలలకు చెందిన 240 విద్యార్థులను ఎక్స్‌జర్‌ విజిట్‌కి తీసుకెళుతున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల నుంచి విద్యార్థులకు శనివారంలోగా ఎక్స్‌పోజర్‌ విజిట్స్‌ పూర్తి చేయాలని ఎంఈవో-2లకు బాధ్యతలు అప్పగించారు. నర్సీపట్నం మండలం ఎరకన్నపాలెం ఎంపీపీ పాఠశాల, మునిసిపాలిటీ ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేశారు. గురువారం ఎరకన్నపాలెం స్కూల్‌కు చెందిన ఐదురుగు విద్యార్థులను హెచ్‌ఎం ఏవీ ప్రసాద్‌ తన కారులో వేములపూడి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సచివాలయం, గ్రామీణ బ్యాంకు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి తీసుకు వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలు, ఉపయోగాల గురించి వివరించారు. ఇంకా మునగపాక, వి.మాడుగుల, కశింకోట, రాంబిల్లి, పరవాడ, మాకవరపాలెంలో ఎక్స్‌పోజ్‌ విజిట్స్‌ జరిగాయి. మాడుగుల హల్వా తయారు చేసే విధానం, కశింకోట మండలం బయ్యవరంలో హెరిటేజ్‌ డెయిరీ సందర్శన నిర్వహించారు. శనివారం మిగిలిన మండలాలలో ఎక్స్‌పోజర్‌ విజిట్స్‌ పూర్తి చేస్తారని విద్యా శాఖ అధికారులు చెప్పారు.

Updated Date - Apr 18 , 2025 | 12:13 AM