Share News

మద్యం సేవించి వేధిస్తున్న భర్తపై వేడి నూనెతో దాడి

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:27 PM

మద్యం సేవించి వేధిస్తున్న భర్తపై మరిగిన వేడి నునె పోయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పరవాడ మండలం సాలాపువానిపాలెంలో మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ కృష్ణారావు తెలిపిన వివరాలిలా వున్నాయి.

మద్యం సేవించి వేధిస్తున్న భర్తపై వేడి నూనెతో దాడి
తీవ్రంగా గాయపడిన గండికోట బాలకృష్ణ

లంకెలపాలెం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి వేధిస్తున్న భర్తపై మరిగిన వేడి నునె పోయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పరవాడ మండలం సాలాపువానిపాలెంలో మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ కృష్ణారావు తెలిపిన వివరాలిలా వున్నాయి. గుంటూరు ప్రాంతానికి గండికోట బాలకృష్ణ రైల్వేలో లోకో ఫైలట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి నక్కా రవణమ్మను ప్రేమించి ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు వీరికి ఒక బాబు ఉన్నాడు. 20 రోజుల క్రితం సాలాపునివానిపాలెంలో ఇంటిని అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. బాలకృష్ణ తరచూ మద్యం సేవించి భార్యతో గొడవ పడుతున్నాడు. సోమవారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఇంటి యాజమాని, ఇరుగుపొరుగు వారు సర్దుబాటు చేశారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇరువురు మరోసారి గొడవ పడ్డారు. దీంతో రమణమ్మ నూనెను బాగా మరిగించి బాలకృష్ణ ముఖంపై పోసి, తలుపులు వేసి పరారైంది. దీంతో అతను బిగ్గరగా కేకలు వేయడంతో ఇంటి యజమాని తాతారావు, స్థానికులు వచ్చి తలుపులు తీసి బాలకృష్ణను అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యానికి తరలించారు. 40 శాతానికిపైగా శరీరం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. తనపై గతంలో ఒకసారి యాసిడ్‌తో దాడి చేసినట్టు బాలకృష్ణ పోలీసులకు తెలిపాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 22 , 2025 | 11:27 PM