Share News

‘తాండవ’ పనులకు నిధులు ఇవ్వండి

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:34 AM

తాండవ రిజర్వాయర్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ కరక సత్యనారాయణ, గురువారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుని కలసి వినతిపత్రం అందజేశారు.

‘తాండవ’ పనులకు నిధులు ఇవ్వండి
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుకు వినతిపత్రం ఇస్తున్న తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ కరక సత్యనారాయణ

మంత్రి రామానాయుడుకు ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ వినతి

నాతవరం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తాండవ రిజర్వాయర్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ కరక సత్యనారాయణ, గురువారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుని కలసి వినతిపత్రం అందజేశారు. కాకినాడ జిల్లా తుని పట్టణానికి వచ్చిన మంత్రిని తాండవ నీటిసంఘాల అధ్యక్షులతోపాటు కలిశారు. తాండవ రిజర్వాయర్‌కు సంబంధించి 103 పనులకు 14 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి రామానాయుడును కలిసినవారిలో టీడీపీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, అపన దివాణం, తదితరులు వున్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:34 AM