Share News

ఐపీఎల్‌ ఫీవర్‌

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:14 AM

నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌పై క్రీడాభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ఐపీఎల్‌ ఫీవర్‌

  • నగరంలో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌

  • హాట్‌కేకుల్లా టికెట్ల అమ్మకం

విశాఖపట్నం స్పోర్ట్సు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌పై క్రీడాభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజర్స్‌ ఏసీఏ స్టేడియాన్ని హోమ్‌ గ్రౌండ్‌గా చేసుకున్నా...క్రీడాభిమానులు మాత్రం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును హోమ్‌ టీమ్‌గా భావిస్తున్నారు. గత రెండు సీజన్ల నుంచి అద్భుతమైన ఆటతీరును కనబరుస్తోన్న సన్‌రైజర్స్‌ జట్టు ఈ సీజన్‌ టైటిల్‌ ఫేవరెట్‌లలో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

రూ.4 వేలు, రూ.6 వేలు మినహా అన్ని టికెట్లు ఫుల్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్‌కు డిమాండ్‌ రావడంతో టికెట్లు దాదాపుగా అమ్ముడైపోయాయి. శుక్రవారం రాత్రి సమయానికి ఏ స్టాండ్‌లోని నాలుగు వేల రూపాయల టికెట్లు కొన్ని, సౌత్‌ వెస్ట్‌ అప్పర్‌ స్టాండ్‌, సౌత్‌ ఈస్ట్‌ అప్పర్‌ స్టాండ్‌లో రూ.ఆరు వేలు విలువ గల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన టికెట్లు అన్నీ అమ్ముడైపోయాయి.

Updated Date - Mar 29 , 2025 | 01:14 AM