Share News

విద్యార్థి దశలోనే చట్టాలను అధ్యయనం చేయాలి

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:40 PM

విద్యార్థి దశలోనే చట్టాలను అధ్యయనం చేయాలని న్యాయ విద్యార్థులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వీఆర్‌కే కృపాసాగర్‌ సూచించారు.

విద్యార్థి దశలోనే చట్టాలను అధ్యయనం చేయాలి
మాట్లాడుతున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వీఆర్‌కే కృపాసాగర్‌

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వీఆర్‌కే కృపాసాగర్‌

సబ్బవరం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశలోనే చట్టాలను అధ్యయనం చేయాలని న్యాయ విద్యార్థులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వీఆర్‌కే కృపాసాగర్‌ సూచించారు. స్థానిక దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో బుధవారం ‘న్యాయ విద్య- న్యాయవాద వృత్తి’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్సు పూర్తయి బయటకు వెళితే ఎవరూ పట్టించుకోరని, కాలేజీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని వర్సిటీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. అందుకు తగిన వాతావరణం ప్రతి వర్సిటీలో ఉంటుందన్నారు. దేశంలో ఉన్న హైకోర్టుల తీర్పులు, సుప్రీం కోర్టు తీర్పులపైన కూడా అధ్యయనం చేయాలన్నారు. కాలానుగుణంగా వచ్చే మార్పులు, తీర్పులపై అవగాహన పెంచుకుంటే న్యాయవాద వృత్తిలో విజయవంతంగా రాణించవచ్చునన్నారు. అంతకు ముందు వీసీ ప్రొఫెసర్‌ డి.సూర్యప్రకాశరావు అధ్యక్షోపన్యాసం చేశారు. అనంతరం వీఆర్‌కే కృపాసాగర్‌ను వీసీ జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విశ్వచంద్రనాథ్‌ మాదాసు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:40 PM