Share News

నీటి పారుదల శాఖ ఈఈగా రాజేశ్వరరావు

ABN , Publish Date - Apr 17 , 2025 | 10:46 PM

చిన్న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా ఆర్‌.రాజేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

నీటి పారుదల శాఖ ఈఈగా రాజేశ్వరరావు
ఆర్‌.రాజేశ్వరరావు

పాడేరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): చిన్న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా ఆర్‌.రాజేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక నీటి పారుదల శాఖ ఈఈ పోస్టు ఖాళీగా ఉండడంతో విజయనగ రం జిల్లా చిన్ననీటి పారుదల శాఖ ఈఈగా పని చేస్తున్న ఎంవీ రమణకు ఇన్నాళ్లుగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా చోడవరంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఆర్‌.రాజేశ్వరరావుకు స్థానిక ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో సైతం సాగునీటి వనరుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో అధికారుల నియామకంపై దృష్టి సారిస్తున్నది.

Updated Date - Apr 17 , 2025 | 10:47 PM