రాయి క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:21 PM
రాయి క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా, పలు క్వారీల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి మార్టూరులో పలు రాయి క్వారీలను ఆయన తనిఖీ చేశారు.
జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా
మార్టూరులోని పలు క్వారీల్లో తనిఖీలు
తుమ్మపాల, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): రాయి క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా, పలు క్వారీల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి మార్టూరులో పలు రాయి క్వారీలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతీ క్వారీ, క్రషర్‌లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వీటి వద్ద యాజమాన్యం వివరాలు తెలిసేలా సరిహద్దులు నిర్ణయిస్తూ బోర్డులు పెట్టాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మైన్స్, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని క్వారీ, క్రషర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్వారీ, క్రషర ్లపై నిఘా ఉంచాలని తన వెంట వున్న పోలీసు సిబ్బందిని ఆదేశించారు. నిబంధనలు పాటించకుండా, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న క్వారీలు, క్రషర్ల యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ జి.అశోక్‌కుమార్, ఎస్‌ఐ జి.రవికుమార్, సిబ్బంది వున్నారు.