Share News

మోదకొండమ్మ సన్నిధిలో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ సతీమణులు

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:14 PM

అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి సోమవారం సాయంత్రం మోదకొండమ్మను దర్శించుకున్నారు.

మోదకొండమ్మ సన్నిధిలో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ సతీమణులు
మోదకొండమ్మను దర్శించుకుంటున్న స్పీకర్‌ సతీమణి పద్మావతి, డిప్యూటీ స్పీకర్‌ సతీమణి రమాదేవి, తదితరులు

పాడేరు, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి సోమవారం సాయంత్రం మోదకొండమ్మను దర్శించుకున్నారు. ఇక్కడికి వచ్చిన వారిద్దరికీ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిద్దరూ ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం పద్మావతి, రామాదేవీలకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు సల్లా రామకృష్ణ, కెజియారాణి, కొణతాల ప్రశాంత్‌, తదితరులు అమ్మవారి చిత్రపటాలను అందించి, శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మణికుమారి, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ వంజంగి కాంతమ్మ, టీడీపీ నేతలు బూరెడ్డి నాగేశ్వరావు, అల్లంగి సుబ్బలక్ష్మ, డిప్పల కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:14 PM