సూర్యనమస్కారాల ట్రైల్‌రన్
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:11 PM
ఈనెల 7వ తేదీన 20 వేల మంది బాలబాలికలతో చేపట్టనున్న 108 సూర్య నమస్కారాల కార్యక్రమానికి శనివారం సాయంత్రం మూడు వేల మంది బాలబాలికలతో ట్రైల్‌రన్ నిర్వహించారు.
పాల్గొన్న మూడు వేల మంది బాలబాలికలు
టీడబ్ల్యూ డిప్యూటీ డైరెక్టర్ రజని పర్యవేక్షణ
అరకులోయ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ఈనెల 7వ తేదీన 20 వేల మంది బాలబాలికలతో చేపట్టనున్న 108 సూర్య నమస్కారాల కార్యక్రమానికి శనివారం సాయంత్రం మూడు వేల మంది బాలబాలికలతో ట్రైల్‌రన్ నిర్వహించారు. మండల కేంద్రంలోని తొమ్మిది గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలల బాలబాలికలతో టీడబ్ల్యూ డిప్యూటీ డైరెక్టర్ రజని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బాలబాలికలు క్రమశిక్షణతో మైదానంలోకి ఏవిధంగా రావాలి.. వచ్చిన వారు కేటాయించిన స్థలాల్లో ఎలా చేరుకోవాలన్న అంశంపై అవగాహన కల్పించారు. మైదానంలో చేరిన మూడు వేల మంది విద్యార్థులతో 4.30 నుంచి 6 గంటల వరకు యోగా గురువు పతంజలి శ్రీనివాసరావు సూర్య నమస్కారాలు వేయించారు. ఈ ట్రైల్‌రన్ ఎలా చేపట్టారో అదేవిధంగా ఏడవ తేదీన బాలబాలికలను తీసుకురావాలని పీఈటీ, పీడీలు, హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, వార్డెన్‌లను డీడీ రజని ఆదేశించారు.