26, 29 తేదీల్లో నగరానికి ముఖ్యమంత్రి
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:23 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 26న ఒకసారి, 29న మరొకసారి నగరానికి రానున్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 26న ఒకసారి, 29న మరొకసారి నగరానికి రానున్నారు. 26వ తేదీన ఆయన విశాఖపట్నం వచ్చి, హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా వెళతారు. అక్కడ ‘మత్స్యకార భరోసా’ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. లబ్ధిదారులకు చెక్‌లు అందజేస్తారు. కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ఇక్కడ నుంచి విజయవాడ వెళతారు. అలాగే ఈనెల 29వ తేదీ రాత్రి సతీసమేతంగా సీఎం నగరానికి రానున్నారు. ఈనెల 30వ తేదీన సింహాచలం వరాహనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.