ఇది కూటమి విజయం
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:24 PM
కూటమి హయాంలో మాత్రమే అభివృద్ధి జరుగుతున్నదన్న ఉద్దేశంతో బీజేపీలో చేరిన మునిసిపల్ చైర్‌పర్సన్ రమాకుమారిని పదవి నుంచి దించేయడానికి వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అన్నారు.
ప్రభుత్వ అభివృద్ధిని చూసి వైసీపీ కౌన్సిలర్లు మనసు మార్చుకున్నారు
అందుకే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్
ఎలమంచిలి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కూటమి హయాంలో మాత్రమే అభివృద్ధి జరుగుతున్నదన్న ఉద్దేశంతో బీజేపీలో చేరిన మునిసిపల్ చైర్‌పర్సన్ రమాకుమారిని పదవి నుంచి దించేయడానికి వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అన్నారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు ఎలమంచిలి అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. ఆయన ప్రోత్సాహంతోనే వైసీపీ కౌన్సిలర్లు, చైర్‌పర్సన్ రమాకుమారిపై అవిశ్వాస నోటీసు ఇచ్చారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి పలువురు వైసీపీ కౌన్సిలర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నబాబురాజు, యానాద్రి కాలువ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. మరో రెండు రోజుల్లో యానాద్రి కాలువ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. చైర్‌పర్సన్ రమాకుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం కూటమి విజయంగా ఆయన అభివర్ణించారు. ఆయన వెంట కూటమి నాయకులు శ్రీరామదాసు, కొఠారు శ్రీను, అన్నం బాబ్జీ, పప్పు ఈశ్వరరావు, గుర్రాల శేఖర్, చిట్టిబాబు తదితరులు వున్నారు.