Share News

వంతెనల నిర్మాణంతో గ్రామాభివృద్ధి

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:45 PM

వంతెనల నిర్మాణంతోనే మారుమూల గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.

వంతెనల నిర్మాణంతో గ్రామాభివృద్ధి
వంతెనను ప్రారంభించి పరిశీలిస్తున్న మంత్రి సంధ్యారాణి

మంత్రి గుమ్మడి సంధ్యారాణి

సంపంగి గెడ్డపై బ్రిడ్జి ప్రారంభం

డుంబ్రిగుడ, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): వంతెనల నిర్మాణంతోనే మారుమూల గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని కించుమండలో సంపంగి గెడ్డపై రూ.4.4 కోట్లతో నిర్మించిన వంతెనను సోమవారం ఆమె ప్రారంభించారు. నిర్మాణ పనుల నాణ్యతపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకార్యల కల్పనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌, ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ దొన్నుదొర, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్బారావు, స్థానిక సర్పంచ్‌ చెల్లమ్మ, కితలంగి సర్పంచ్‌ సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యురాలు విజయ, అరకు పార్లమెంట్‌ కోశాధికారి నాగేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్‌ వేణుగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:45 PM