Share News

విశాఖ కేంద్రంగా జల వనరుల శాఖ డివిజన్‌

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:30 AM

విశాఖపట్నంలో జల వనరుల శాఖ డివిజన్‌ ఏర్పాటుచేస్తామని సంబంధిత మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. డివిజన్‌ కార్యాలయాన్ని జిల్లాల విభజన నేపథ్యంలో నర్సీపట్నం తరలించారు. బుధవారం జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం విశాఖలో డివిజన్‌ ఏర్పాటు గురించి ప్రస్తావించగా మంత్రి బదులిస్తూ ఈఎన్‌సీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

విశాఖ కేంద్రంగా జల వనరుల శాఖ డివిజన్‌

మంత్రి నిమ్మల రామానాయుడు హామీ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో జల వనరుల శాఖ డివిజన్‌ ఏర్పాటుచేస్తామని సంబంధిత మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. డివిజన్‌ కార్యాలయాన్ని జిల్లాల విభజన నేపథ్యంలో నర్సీపట్నం తరలించారు. బుధవారం జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం విశాఖలో డివిజన్‌ ఏర్పాటు గురించి ప్రస్తావించగా మంత్రి బదులిస్తూ ఈఎన్‌సీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నగరంలో జల వనరుల శాఖకు విలువైన ఆస్తులు ఉన్నాయంటూ వాటి రక్షణ, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నిర్వహణ, ప్రోటోకాల్‌ వ్యవహారాల పర్యవేక్షణకు విశాఖలో డివిజన్‌ కార్యాలయం ఉండాల్సిన అవసరాన్ని గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. కాగా మంత్రి హోదాలో పార్టీ కార్యాలయానికి వచ్చిన మంత్రికి పార్లమెంటు అధ్యక్షుడు గండి బాబ్జీ సత్కరించారు.

Updated Date - Apr 24 , 2025 | 01:30 AM