సాకిగెడ్డ వద్ద చెక్ డ్యాం నిర్మించాలి
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:53 PM
మండలంలోని సాకిగె డ్డ పరిసర ప్రాంతాల్లో చెక్ డ్యాం నిర్మించి తమ వ్యవసాయ భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రను తాళ్లబురిడి గ్రామస్థులు కోరారు.
పార్వతీపురం రూరల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సాకిగె డ్డ పరిసర ప్రాంతాల్లో చెక్ డ్యాం నిర్మించి తమ వ్యవసాయ భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రను తాళ్లబురిడి గ్రామస్థులు కోరారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు ఎమ్మెల్యేను కలిసి, వినతిపత్రం అందజేశా రు. చెక్ డ్యాం నిర్మించేందుకు తగు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు వివిధ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ డెరెక్టర్ గొట్టాపు వెంకటనా యుడు, తదితరులు పాల్గొన్నారు.