Home » Andhra Pradesh » Vizianagaram
బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం రాబోతోంది. విజయనగరం జిల్లాలోని బాడంగిలో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత అది నిరుపయోగమైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. అందు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
జిల్లాలోని చాలామంది విద్యార్థులు విశాల్ లాంటి పరి స్థితినే ఎదుర్కొంటున్నారు. చదువులో ముందున్నా, పరీక్షల్లో మార్కులు బాగా సాధించి మంచి ర్యాంకులు తెచ్చుకున్నా ఉద్యోగ సాధనలో మాత్రం విఫలమవుతున్నారు.
ఎన్నేళ్లయినా.. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మత్స్యకారుల బతుకులు మాత్రం మారడంలేదు.
సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన జగతిపల్లి వ్యూపాయింట్, రిసార్ట్స్ అభివృద్థి పనులకు మోక్షం లభించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్ట్కు బ్రేక్ పడింది. నిధులున్నా.. పనులు పూర్తికాని పరిస్థితి.
జిల్లాలో రేషన్ డిపోల సంఖ్య పెరగనుంది. డీలర్ల పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. కార్డుదారులకు మెరుగైన సేవలందించాలనే కూటమి ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కదిలింది. డిపోల పెంపునకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు.
జిల్లాలో గంజాయి రవాణా, అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
గిరిజన ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి రాష్ట్రంలోని గిరిజన కుటుంబాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు.
చేతుల పరిశుభ్రతకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం స్వచ్ఛ పార్వతీపురం, మరుగుదొడ్ల దినం తదితర అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో పత్తి రైతుల సౌకర్యార్థం రామభద్రపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిందని, రైతులు తాము పండించిన పత్తిని ఆ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందవచ్చునని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకుడు పి.రవికిరణ్ సూచించారు.
సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకు అధికారులు సహకరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి కోరారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పలు బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు.