Share News

నిరసనల హోరు

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:10 AM

పార్వతీపురం మ న్యం కలెక్టరేట్‌ సోమవారం నిరసనలతో హోరెత్తింది. వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు.

నిరసనల హోరు

బెలగాం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మ న్యం కలెక్టరేట్‌ సోమవారం నిరసనలతో హోరెత్తింది. వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయాలని కోరుతూ సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యం లో కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆ పార్టీ నాయకుడు ఎం.గోపాలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయలేదని ఆరోపించారు. ఉపాధి కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలని, పని దినాలు పెంచాలని కోరారు.

మక్కువ మండలం సీబిల్లి పెద్దవలసకు చెందిన దీసరి అప్పలస్వామి భూమి ని సాక్షి సంతకాల పేరుతో తన పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న అదే గ్రామానికి చెందిన ఒక ఆసామిపై చర్యలు తీసుకోవాలని రైతు కూలీ సంఘం నాయకుడు శ్రీనునాయుడు డిమాండ్‌ చేశారు. గిరిజనులు, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

గిరిజనులు, దళితులు, పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యం లో ఆందోళన చేపట్టారు. ముందుగా పాత బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు.

కూల్చివేసిన స్థలం ఆక్రమణే..

బెలగాం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం బంటువానివలస గ్రామంలో ఆదివారం ప్రభు త్వం ప్రహరీని కూల్చివేసి స్వాధీనం చేసుకున్న 11 సెంట్ల స్థలం మాజీ సర్పంచ్‌ ఆక్రమించిన స్థలమేనని, దీనిపై ఎటువంటి రాజకీయ కక్షలు లేవని ఆ గ్రామస్థులు తెలపా రు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో జేసీకి వినతిపత్రం అందించారు. అనంతరం వారు విలేక ర్లతో మాట్లాడారు. గతంలో బంటువానివలసలో అడ్డాపు శిల మాజీ సర్పంచ్‌ భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిం చారు. దీనిపై అనేక మార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. నిబంధనల ప్రకార మే అధికారులు ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నా రని వారు స్పష్టంచేశారు. ఈ ఘటనను ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై నెట్టి బురద జల్లడం సమంజసం కాద న్నారు. అనంతరం జేసీ శోభికకు వినతిపత్రం ఇచ్చారు. అనేక భూ కబ్జాలకు పాల్పడిన మాజీ సర్పంచ్‌పై విచారణ చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మర్రాపు పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

గిరిజన సమస్యలు పరిష్కరించండి

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): గిరిజ నులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, గిరిజన గ్రామాలను ఐదవ షెడ్యూల్డ్‌లో చేర్చాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరిజన ఉత్పత్తులు చేతపట్టి ధర్నా చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఆర్గనైజర్‌ ఊర్లక త్రినాథ్‌ మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగ యువకు ఉద్యోగ వకాశాలు కల్పించాలని, రెవెన్యు సమస్యలు పరిష్కరించా లని డిమాండ్‌ చేశారు. గిరిజన ఉత్పత్తులకు జీసీసీ ద్వారా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలన్నారు. ఈ ధర్నాలో గిరిజన సంఘం నాయకులు తెల్లయ్య, ఎస్‌.చిన్నారావు, ఎల్లంగ, తవుడు, కన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:10 AM