Share News

Unbreakable Bond మృత్యువులోనూ వీడని బంధం

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:43 PM

An Unbreakable Bond Beyond Death వారిద్దరూ దంపతులు. పని నిమిత్తం సాలూరుకు వచ్చారు. పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ రూపంలో వారిని మృత్యువు కబళించింది. ఈ ఘటన సాలూరు పట్టణంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

  Unbreakable Bond  మృత్యువులోనూ వీడని బంధం

  • సాలూరులో ఘటన

  • వంగరగుడ్డివలసలో విషాదం

సాలూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): వారిద్దరూ దంపతులు. పని నిమిత్తం సాలూరుకు వచ్చారు. పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ రూపంలో వారిని మృత్యువు కబళించింది. ఈ ఘటన సాలూరు పట్టణంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ వంగరగుడ్డివలస గ్రామానికి చెందిన మజ్జి రాము (51), మజ్జి గురిబారి (47) భార్యాభర్తలు. వీరిద్దరూ ఆదివారం ఉదయం కుటుంబ పనుల నిమిత్తం సాలూరుకు వచ్చారు. పనులు ముగించుకొని ఆదివారం రాత్రి తమ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సాలూరు వై జంక్షన్‌ బైపాస్‌ రోడ్డు వద్ద ఒడిశా నుంచి రామభద్రపురం వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రాము, గురిబారి దంపతులకు పిల్లలు లేనట్లు సమాచారం. వీరి మృతితో వంగరగుడ్డివలసలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Mar 23 , 2025 | 11:43 PM