Share News

Betting బెట్టింగ్‌లతో జీవితాలు నాశనం చేసుకోవద్దు

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:01 AM

Don't Ruin Your Life with Betting ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి సూచించారు. సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ.. ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై యువత బెట్టింగ్‌లకు పాల్పడుతూ.. ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు.

  Betting  బెట్టింగ్‌లతో జీవితాలు నాశనం చేసుకోవద్దు
మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి సూచించారు. సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ.. ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై యువత బెట్టింగ్‌లకు పాల్పడుతూ.. ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వాటి జోలికి వెళ్లరాదని తెలిపారు. గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినా, ఇతరులను ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రికెట్‌ మ్యాచ్‌లను వినోదం కోసం చూడాలే తప్పా విషాదం కోసం కాదన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:01 AM