Share News

పెళ్లి ఇష్టం లేక..

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:09 AM

మండలంలోని అన్నంరాజుపేట గ్రామానికి చెందిన ఒక యువకుడు తల్లిదండ్రులను భయపెట్టాలని బుధవారం పురుగు మందు తాగాడు.

పెళ్లి ఇష్టం లేక..

జామి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్నంరాజుపేట గ్రామానికి చెందిన ఒక యువకుడు తల్లిదండ్రులను భయపెట్టాలని బుధవారం పురుగు మందు తాగాడు. దాంతో ఆ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి హెడ్‌ కానిస్టే బుల్‌ ఈశ్వరరావు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అన్నంరాజుపేటకు చెం దిన జలగడుల కృపారావు(26)ను కొద్దినెలలుగా త ల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తు న్నారు. సంబంధాలు కూడా చూస్తున్నారు. పెళ్లి ఇప్పుడే వద్దని చెప్పిన వారు వినలేదు. దీంతో కృపారావు ఈనెల 14న ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో తల్లిదండ్రులను భయపెట్టి పెళ్లిగోల తప్పించుకోవాలని పురుగు మందు తాగాడు. వెంటనే విషయం గుర్తించిన తల్లిదండ్రులు విజయనగరంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. చేతికి అందివచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయరు. మృతుడి తండ్రి అప్పారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 17 , 2025 | 12:09 AM