Extensive Inspections జిల్లాలో విస్తృత తనిఖీలు
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:51 PM
Extensive Inspections in the District జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా శనివారం పోలీసులు క్లూస్ టీం, డ్వాగ్ స్క్వాడ్ టీముల సాయంతో విస్తృత తనిఖీలు చేశారు.
అనుమానితుల నుంచి వేలిముద్రల సేకరణ
బెలగాం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా శనివారం పోలీసులు క్లూస్ టీం, డ్వాగ్ స్క్వాడ్ టీముల సాయంతో విస్తృత తనిఖీలు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లాలోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. శనివారం పార్వతీపురం, సాలూరు, గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జీలు, మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అంతరాష్ట్ర రహదారి, జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా వాహనాలను పరిశీలించారు. అనుమానుతుల వద్ద నుంచి వేలి ముద్రలు తీసుకున్నారు. ‘ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద ఇక్కడకి వచ్చారు..’ అని పలువురి నుంచి వివరాలు సేకరించారు.