Share News

Girls have the upper hand బాలికలదే పైచేయి

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:09 AM

Girls have the upper hand పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. జిల్లాలో 11,413 మంది బాలురు పరీక్ష రాయగా 9,748 (84.41)మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 11,364 మంది పరీక్షకు హాజరుకాగా 10,076(88.67) మంది ఉత్తీర్ణులయ్యారు.

Girls have the upper hand బాలికలదే పైచేయి
అత్యధిక మార్కులు సాధించిన పక్కి సాయివిజయ్‌(596)

బాలికలదే పైచేయి

టెన్త్‌ ఫలితాల్లో ఉత్తమంగా రాణింపు

జిల్లాలో 87.04 శాతం ఉత్తీర్ణత

రాష్ట్రంలో 7వ స్థానం.. 19,824 మంది పాస్‌

విజయనగరం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. జిల్లాలో 11,413 మంది బాలురు పరీక్ష రాయగా 9,748 (84.41)మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 11,364 మంది పరీక్షకు హాజరుకాగా 10,076(88.67) మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన వారిలో 19,824(87.04 శాతం) మంది విద్యార్థులు టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించారు. తద్వారా రాష్ట్రంలో జిల్లాకు 7వ స్థానం దక్కింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ పదో తరగతి ఫలితాలను బుధవారం ఉదయం విడుదల చేశారు. జిల్లాలో బాలురు కంటే బాలికలు అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది మార్చి 17 నుంచి ఈనెల 2వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకూ జవాబుపత్రాల మూల్యాంకనం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పరీక్షలు పూర్తయిన 20 రోజుల్లో ఫలితాలు విడుదలయ్యాయి.

జిల్లా ఫస్ట్‌ సాయివిజయ్‌కు 596 మార్కులు

పదో తరగతి ఫలితాల్లో బొబ్బిలి అభుద్యయ పాఠశాలకు చెందిన పక్కి సాయివిజయ్‌ 596 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్‌గా నిలిచాడు. ఈ విద్యార్థి తండ్రి వెంకటరమణమూర్తి ప్రైవేట్‌ విద్యాసంస్ధలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తల్లి సాయిశ్రీకళ గృహిణి. అలాగే విజయనగరంలోని ప్రభాకర్‌ పాఠశాలకు చెందిన ఎస్‌ఎస్‌వీఏ లాస్యప్రియ 595 మార్కులు దక్కించుకున్నారు. విజయనగరం శ్రీచైతన్య పాఠశాలకు చెందిన డొంక హర్షిని కూడా 595 మార్కులు సాధించారు. వీరిద్దరూ జిల్లాలో ద్వితీయ స్థానంలో ఉన్నారు. కాగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అత్యధిక విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించారు. భోగాపురం ఆదర్శ పాఠశాలలో చదివిన కోయ్య హరీష్‌ 593 మార్కులు, మెరకముడిదాం జడ్పీ పాఠశాలకు చెందిన సంగరెడ్డి వివేక్‌ 593 మార్కులు, నెల్లిమర్ల ఎంజేపీబీసీ స్కూల్‌కు చెందిన మోహెర్‌ రేష్మకు 592 మార్కులు, బొబ్బిలి ఎంజేపీబీసీకి చెందిన చోడవరపు శివకు 592 మార్కులు, ఎల్‌.కోట మండలం కోట్యాడ జడ్పీ పాఠశాలకు చెందిన పెదిరెడ్ల భవ్యశ్రీకి 592 మార్కులు, బొబ్బిలి మండలం పక్కి జడ్పీ పాఠశాలకు చెందిన ఎస్‌కె లావణ్యకు 592 మార్కులు వచ్చాయి. వీరే కాకుండా మరి కొంతమంది విద్యార్థులు కూడా అత్యధిక మార్కులు సాధించారు.

శతశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు

జిల్లాలో 79 పాఠశాలల్లో శతశాతం ఫలితాలు వచ్చాయి. వీటిల్లో 55 ప్రైవేటు పాఠశాలలు, 14 జడ్పీ పాఠశాలలు, 4 కేజీబీవీలు, 4 బీసీ వెల్ఫేర్‌ స్కూల్స్‌, ఒక ఎయిడెడ్‌, ఒక ఏపీఆర్‌ఐ పాఠశాలల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాయి.

19 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

వచ్చే నెల 19వ తేదీ నుంచి 28 వరకూ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పుడు ఉత్తీర్ణత కాని విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా అపరాధ రుసం లేకుండా ఫీజు చెల్లించాలి. వచ్చే నెల మొదటి నుంచి 18వ తేదీ వరకూ రూ.50 రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా రీ కౌంటింగ్‌ కోసం(సబ్జెక్టు రూ.500), రీ వెరిఫికేషన్‌ కోసం (సబ్జెక్టుకు రూ.1000) చొప్పున ఈనెల నెల 24వ తేదీ నుంచి మే ఒకటిలోగా చెల్లించాలి.

పాఠశాలల వారీగా ఫలితాలు

పాఠశాల పేరు రాసినవారు ఉత్తీర్ణులు ఉత్తీర్ణత శాతం

-------------------------------------------------------------------------------------

ఎయిడెడ్‌ 143 128 87.07

మోడల్‌స్కూల్స్‌ 1158 1075 92.83

ఏపీఆర్‌ఎస్‌ 161 160 99.38

ప్రభుత్వ పాఠశాలలు 685 478 69.78

కేజీబీవీ 971 890 91.66

ఎంజేపీబీసీ వెల్ఫేర్‌ 410 396 96.59

మున్సిపల్‌ 682 439 64.37

ప్రైవేటు 6314 6088 96.42

సోషల్‌ వెల్ఫేర్‌ 559 485 86.76

గిరిజన సంక్షేమ శాఖ 202 159 78.71

=============================

ఆరేళ్లలో జిల్లాలో నమోదైన ఫలితాలు

ఏడాది హాజరు ఉత్తీర్ణత శాతం

-----------------------------

2019-20 30030 30030 100

2020-21 29368 29368 100

2021-22 29365 22758 77.50

2022-23 24040 18430 76.66

2023-24 23690 21752 91.82

2024-25 22777 19824 87.04

-----------

Updated Date - Apr 24 , 2025 | 12:09 AM