Share News

good Price ‘ధర’హాసం!

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:31 PM

good Price జిల్లాలో జీడి పిక్కల ధర ఆశాజనంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ దృష్ట్యా వాటి ధర అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ‘మన్యం’లో కిలో జీడి పిక్కల ధర నాణ్యతను బట్టి రూ.150 నుంచి రూ.162 వరకు పలుకుతోంది. దీంతో గిరిజనులు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

good Price  ‘ధర’హాసం!
ఇరిడి గ్రామంలో జీడిపిక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన దృశ్యం

గిరిజన రైతుల్లో ఆనందం

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జీడి పిక్కల ధర ఆశాజనంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ దృష్ట్యా వాటి ధర అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ‘మన్యం’లో కిలో జీడి పిక్కల ధర నాణ్యతను బట్టి రూ.150 నుంచి రూ.162 వరకు పలుకుతోంది. దీంతో గిరిజనులు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 80 వేల హెక్టార్లకు పైగా జీడితోటలు ఉన్నాయి. ఏజెన్సీలోని కొండ ప్రాంతాల్లో అవి ఉండగా.. ఈ ఏడాది దిగుబడి బాగానే వచ్చింది. వాటికి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, మొండెంకల్‌, సీతంపేట, వీరఘట్టం, పాలకొండలో వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, కేరళ తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో జీడిపిక్కలు ధర కిలో రెండు వందల రూపాయలు పలికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపారులు, పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు వెలుగు సంస్థ కూడా జీడిపిక్కల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి జీడిపిక్కలు కొనుగోలు చేస్తున్నామని ఏపీఎం ఆర్‌.రామకృష్ణ తెలిపారు. దళారుల దోపిడీకి గురవకుండా గిరిజన రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:31 PM