Hat-trick Anticipation హ్యాట్రిక్‌పై ఉత్కంఠ
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:49 PM
Hat-trick Anticipation పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. అయితే జిల్లా మరోసారి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించి హ్యాట్రిక్ విజయం అందుకుంటుందా? లేదా? అనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.
సాలూరు రూరల్, ఏరప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. అయితే జిల్లా మరోసారి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించి హ్యాట్రిక్ విజయం అందుకుంటుందా? లేదా? అనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. పదో తరగతి ఫలితాల్లో వరుసగా గత రెండేళ్లు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లా ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉన్నతాధికారులు, విద్యాధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లారు. ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేకాధికారులను సైతం నియమించారు. 2023లో జిల్లా నుంచి 10,689 మంది టెన్త్ పరీక్షలు రాయగా 9,350 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 10,443 మంది పరీక్షలు రాయగా 10,064 మంది పాసయ్యారు. ఈ ఏడాది జిల్లాలో పది వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నేపథ్యంలో జిల్లా రాష్ట్రంలో మళ్లీ ప్రథమస్థానం నిలుపుకుంటుందనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.