He is the 'head' of politics అతనో పైరవీల ‘హెడ్’!
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:40 PM
He is the 'head' of politics ఆయనో హెడ్ కానిస్టేబుల్. రాజకీయంగా పలుకుబడి పెంచుకుని ఓ కీలక ప్రజాప్రతినిధి మెప్పు పొందాడు. ఆపై తనకు నచ్చిన శాఖలో పోస్టింగ్ తెచ్చుకున్నాడు. విజిలెన్స్‌లోకి మార్పు చేసుకున్నాడు. అనంతరం ఆ ప్రజాప్రతినిధి వద్దే తిష్ఠ వేశాడు. క్యాంపు ఆఫీసులో కూర్చొని పెద్దాయన పేరు చెప్పుకుని చక్రం తిప్పుతున్నాడు. పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల్లోనూ బదిలీ కావాలంటే ఆయనను కలిస్తే పని అయిపోయినట్టే అన్న టాక్ జిల్లాలో నడుస్తోంది.
అతనో పైరవీల ‘హెడ్’!
రాజకీయ పలుకుబడితో సొంతశాఖపై పట్టు
తనకు నచ్చిన చోట విధులు, ఆపై వసూళ్లు
కీలక ప్రజాప్రతినిధి అండ ఉన్నట్లు ప్రచారం
ఆయనో హెడ్ కానిస్టేబుల్. రాజకీయంగా పలుకుబడి పెంచుకుని ఓ కీలక ప్రజాప్రతినిధి మెప్పు పొందాడు. ఆపై తనకు నచ్చిన శాఖలో పోస్టింగ్ తెచ్చుకున్నాడు. విజిలెన్స్‌లోకి మార్పు చేసుకున్నాడు. అనంతరం ఆ ప్రజాప్రతినిధి వద్దే తిష్ఠ వేశాడు. క్యాంపు ఆఫీసులో కూర్చొని పెద్దాయన పేరు చెప్పుకుని చక్రం తిప్పుతున్నాడు. పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల్లోనూ బదిలీ కావాలంటే ఆయనను కలిస్తే పని అయిపోయినట్టే అన్న టాక్ జిల్లాలో నడుస్తోంది.
- సీఐ, ఎస్‌ఐల బదిలీల్లో పలువురు కోరుకున్న చోటుకు ఆయనే బదిలీలు చేయించాడని జిల్లా పోలీసు శాఖలో చర్చ నడుస్తోంది. ఓ ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరు ప్రజాప్రతినిధులకు కూడా ఆయన నిత్యం టచ్‌లో ఉంటూ వారికి అవసరమైన పనులూ చేయిస్తాడని ప్రచారం ఉంది. పని చేసినందుకు త్రుణమో పణమో కానుకుగా తీసుకుంటాడన్న ఆరోపణలు ఉన్నాయి.
- 2024లో జరిగిన జిల్లా పోలీస్ శాఖ బదిలీల్లో భాగంగా నగరంలో కీలక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐను నగరం నుంచి బదిలీ చేయించి తనకు ఇష్టమైన వ్యక్తిని సీఐగా తీసుకువచ్చానని ఆ హెడ్‌కానిస్టేబుల్ చెప్పుకుంటున్నట్లు వినికిడి.
విజయనగరం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): విజిలెన్స్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ రాజకీయ పలుకుబడితో రూటు మార్చాడు. కీలక ప్రజాప్రతినిధి క్యాంపు ఆఫీసులో కొలువుదీరి అన్నీతానై వ్యవహరిస్తున్నాడు. బదిలీలు, ప్రమోషన్లు, ఆఖరుకు దందాలకు దిగుతున్నట్లు వినికిడి. పెద్దాయనను కలిసేందుకు వచ్చిన వారంతా తొలుత అతన్నే కలిసి విషయం చెప్తారట. ఆయన హామీ ఇచ్చేస్తే పెద్దాయన కూడా ఊకొడతారని ప్రచారం. జిల్లాలో ఆ ప్రజాప్రతినిధికి తనవల్లే టిక్కెట్ వచ్చిందని, ఓ ఎమ్మెల్సీ ద్వారా లాబీయింగ్ జరిపానని కూడా ప్రచారం చేసుకుంటున్నాడు. కీలక ప్రజాప్రతినిధి క్యాంప్ ఆఫీసు వద్దే కూర్చుని వచ్చీపోయిన వారిని ఏ పనిమీద వచ్చారంటూ స్త్రీనింగ్ కూడా చేస్తాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతను లాబీయింగ్ చేస్తే తప్పక పని అవుతుందన్న నమ్మకంతో ఆ హెడ్ కానిస్టేబుల్‌కు ఎంతోకొంత ముట్టచెబుతున్నారు.
- పోలీస్‌శాఖలో ఇటీవల జరిగిన బదిలీల్లోనూ ఆయన చక్రం తిప్పారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. బదిలీల కోసం పెద్ద అధికారులే ఆయన్ని ఆశ్రయిస్తున్నారు. చివరకు పోలీసు శాఖపరంగా టీడీపీ నేతలకు ఏదైనా పని పడితే ఆ హెడ్ కానిస్టేబుల్‌నే ఆశ్రయిస్తున్నారు. గతంలో ఓ ఎమ్మెల్సీ ద్వారా పోలీసు శాఖలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఆ ఎమ్మెల్సీ ద్వారా తన స్థాయి పెరగడంతో ఆయన విషయంలో కృతజ్ఞత కూడా చాటుకున్నాడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. బాహాటంగానే ఫ్లెక్సీలు కట్టి ఎమ్మెల్సీని ఆహ్వానించడంపై ఆ మధ్య పెద్దఎత్తున చర్చ సాగింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సమయంలో ప్రచార కార్యక్రమాల బ్యానర్లు కట్టించడం, ఇతరత్రా ఎన్నికల పనులు చూసుకున్నది ఈయనేనట. రాజకీయంగా పలుకుబడి ఉండడంతో జిల్లాలో ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే బదిలీల్లో ఆ హెచ్‌సీ బాగానే వెనుకేసుకున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికైనా ఆ కానిస్టేబుల్ వ్యవహార శైలిపై ప్రభుత్వం దృష్టిసారించకపోతే ప్రభుత్వానికి మచ్చ రావొచ్చునన్న టాక్ వినిపిస్తోంది.
--------------