Share News

ఎంఎస్‌ఎంఈలతో పారిశ్రామిక ప్రగతి

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:12 AM

జిల్లాలో 6500కు పైగా ఎంఎస్‌ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి అవ కాశం ఉంటుందని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు.

ఎంఎస్‌ఎంఈలతో పారిశ్రామిక ప్రగతి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

  • నియోజకవర్గాల వారీగా విజన్‌ ప్లాన్‌

  • కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 6500కు పైగా ఎంఎస్‌ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి అవ కాశం ఉంటుందని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే పారిశ్రామిక, సేవా రంగాలు కూడా అభివృద్ధ్ది చెందుతాయని అన్నారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందన్నారు. స్వర్ణాంధ్ర -2047 కెపాసిటీ బిల్డింగ్‌పై విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా అధికారులకు రెండు రోజుల వర్క్‌షాపు బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ప్రారంభి చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ బౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నియోజకవ ర్గానికి విజన్‌ ప్లాన్‌ రూపొందించాలని అన్నారు. క్షేత్ర స్థా యి పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. స్థానిక ఎంఎల్‌ఏల సూచనలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్‌, ప్రణాళిక శాఖ రిటైర్డ్‌ డైరెక్టర్‌, సలహాదారు సీతాపతిరావు, మూడు జిల్లాలకు చెందిన సీపీవోలు బాలా జీ, వీర్రాజు, లక్ష్మీప్రసన్న, నియోజకవర్గాల ప్రత్యేకాధికా రులు, పర్యవేక్షణ బృందాల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:12 AM