తిట్టడమే ధ్యేయమా?
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:03 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఆయన విగ్రహానికి మాజీ ఉప ముఖ్యమంత్రులు పూలమాల వేసి, తనను తిట్టడ మే ధ్యేయంగా పెట్టుకున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు.
సాలూరు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఆయన విగ్రహానికి మాజీ ఉప ముఖ్యమంత్రులు పూలమాల వేసి, తనను తిట్టడ మే ధ్యేయంగా పెట్టుకున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి విమర్శించారు. ఆమె బుధవారం సాలూరులోని తన నివాసం వద్ద విలేకర్లతో మాట్లాడారు. మూడు మతాల మధ్యన చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం పొందు తున్నారని ఆమె ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి సతీమ ణి తిరుపతిలో తలనీలాలు సమర్పిస్తే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. ‘రాష్ట్రంలో తిరుపతి ఉత్తరాలు రోజా తర్వాత అధికంగా అమ్మిన ఘనత మీది కాదా’ అని పుష్పశ్రీవాణిని విమర్శించారు. మోసూరు సర్పంచ్ పాఠశాల భవనాన్ని పడగొట్టి ఆ స్థలంలో రాజభవనాన్ని కట్టుకుంటే విచారణ చేయకూడదా.. రైతుల కు ప్రభుత్వం ఇచ్చిన భూమిని లాక్కుంటే విచారణ చేయించకూ డదా.. తమకు సరిగ్గా భోజనం పెట్టడం లేదని విద్యార్థులు విన్నవిస్తే మంత్రిగా వాస్తవ విషయాలు తెలుసుకోకూడదా... అని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు (చిట్టి), పరమేష్, గుళ్ళ వేణుగోపాలనా యుడు, వెంకట్రావు పాల్గొన్నారు.