పేస్కేల్ అమలు చేయాలి
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:44 PM
పేస్కేల్ అమలు చేయాలని, కనీసం 26 వేల వేతనం ఇవ్వాలని వీఆర్‌ఏలు కోరారు.ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని మండలంలోని వీఆర్‌ఏలు సోమవారం చీపురుపల్లిలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
చీపురుపల్లి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): పేస్కేల్ అమలు చేయాలని, కనీసం 26 వేల వేతనం ఇవ్వాలని వీఆర్‌ఏలు కోరారు.ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని మండలంలోని వీఆర్‌ఏలు సోమవారం చీపురుపల్లిలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్కువ వేతనంతో తమ కుటుంబాలను పోషించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రాత్రి వేళ విధులను రద్దు చేయాలని, అర్హతలున్న వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించాలని కోరారు. వీరికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు మద్దుతు తెలిపారు. కార్యక్రమంలో దండి సూర్యనారాయణ, బి.ఆదినారాయణ, పి.లక్ష్మణ, శారద, తవిటయ్య, బీఎస్సీ నాయకులు అప్పలనాయుడు, అడ్డూరి కృష్ణ, సబ్బి సత్యనారాయణ పాల్గొన్నారు.