Share News

WhatsApp Services! హాయ్‌ అనండి.. వాట్సాప్‌ సేవలు పొందండి!

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:58 PM

Say Hi... Get WhatsApp Services! ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మన మిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 95523 00009కు హాయ్‌ అని మెసేజ్‌ పెట్టి.. సేవలు పొందొచ్చని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు.

  WhatsApp Services! హాయ్‌ అనండి.. వాట్సాప్‌ సేవలు పొందండి!
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మన మిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 95523 00009కు హాయ్‌ అని మెసేజ్‌ పెట్టి.. సేవలు పొందొచ్చని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా కూడా కోరుకున్న సేవలను పొందొచ్చన్నారు. ఆధార్‌ , మొబైల్‌ నెంబర్‌ లేదా సర్వీస్‌ రిక్వెస్ట్‌ ఐడీ వంటి మరికొన్ని అదనపు వివరాలను టెక్ట్స్‌ లేదా వాయిస్‌ రూపంలో ఇచ్చి సర్వీస్‌ కన్ఫర్మేషన్‌ పొందాలన్నారు. లింకు ద్వారా చెల్లింపులు చేసి డిజిటల్‌ కాపీ లేదా రశీదును డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. బుధవారం విడుదలయ్యే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు, ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ ఫలితాలను కూడా మన మిత్ర వాట్సాప్‌ నెంబర్‌ ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. విద్యార్థులు తమ రోల్‌ నెంబర్‌ నమోదు చేసి ఫలితాల పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. జిల్లావాసులు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల మొబైల్‌ ఫోన్ల నుంచి వచ్చే లింకులు, మెసేజ్‌లకు స్పందించరాదన్నారు. ఎవరైనా డిజిటల్‌ అరెస్టు అని చెబితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బెట్టింగ్‌ యాప్స్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోరాదని, వాటిని ఇతరులకు షేర్‌ చేయరాదని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు శక్తియాప్‌ ఉపయోగించుకోవాలన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 11:58 PM