Share News

Sri Reddy: పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి

ABN , Publish Date - Apr 19 , 2025 | 03:15 PM

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కన్నూమిన్నూ కానకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు నీతి వాఖ్యాలు చెబుతోంది. అయినప్పటికీ చేసిన పాపాలు..

Sri Reddy: పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి
Sri Reddy appeared at Pusapatirega Police Station

Sri Reddy: సోషల్ మీడియాలో బరితెగించి వీడియోలు పెట్టిన శ్రీరెడ్డి ఇవాళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో ఆమె విచారణకు హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో ఇవాళ శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి తన ఇష్టానికి వీడియోలు పెట్టి విపక్ష నేతలను బండబూతులు తిట్టిన సంగతి తెలిసిందే. అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి టీడీపీ - జనసేన అధికారంలోకి రావడంతో నీతివాక్కులు పలకడం మొదలుపెట్టింది శ్రీరెడ్డి. అయితే, ఆమెను టీడీపీ అధికారంలోకి వచ్చిన నెలలోపే లోపలేస్తారని అంతా భావించారు. అయితే, దానికి పూర్తి విరుద్ధంగా అధికార టీడీపీ, జనసేన అధినేతలు మహిళ అనో.. మరొకటో కాని శ్రీరెడ్డిపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలకు దిగకపోవడం ఆసక్తిదాయకం.

ఇలా ఉండగా, శ్రీరెడ్డి మీద పలు పోలీస్ స్టేషన్లలో టీడీపీ, జనసేన శ్రేణులు కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన 6 కేసులలో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఫిబ్రవరి 24న హైకోర్టు విచారణ జరిపింది.

అయితే, చిత్తూరు వన్‌టౌన్‌ ఠాణా పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ బెయిలబుల్‌ స్వభావం ఉండటంతో శ్రీరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది హైకోర్టు.

ఇక, విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు.. పలు షరతులు విధించింది. రూ.10 వేలతో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

అలాగే కర్నూలు టూటౌన్‌, కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్‌, విజయనగరం జిల్లా నెలిమర్ల ఠాణాలో నమోదైన కేసులలో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్ల లోపు శిక్షకు వీలున్నవేనని తెలిపింది. ఈ కేసుకు సంబంధించే శ్రీరెడ్డి ఇవాళ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది.


ఇవి కూడా చదవండి:

నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

డల్లాస్‌ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని

హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు

Read Latest and NRI News

Updated Date - Apr 19 , 2025 | 09:19 PM