Survey 40 గ్రామాల్లో సర్వే
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:36 PM
Survey in 40 Villages హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పైపులైన్ల ఏర్పాటుకు సంబంధించి గ్రామాల్లో ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం నుంచి ఒడిశా, రాయపూర్ ప్రాంతాలకు అవసరమైన పెట్రోల్ సరఫరాకు గాను రైతుల భూములు మీదుగా పైపులైన్లు వేయనున్నారు.
గరుగుబిల్లి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పైపులైన్ల ఏర్పాటుకు సంబంధించి గ్రామాల్లో ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం నుంచి ఒడిశా, రాయపూర్ ప్రాంతాలకు అవసరమైన పెట్రోల్ సరఫరాకు గాను రైతుల భూములు మీదుగా పైపులైన్లు వేయనున్నారు. ఈ మేరకు కొమరాడ మండలం కొరిశీల నుంచి బలిజిపేట మండలం సుభద్ర వరకు ఉన్న 40 గ్రామాల పరిధిలో కార్పొరేషన్ సిబ్బంది సర్వే చేస్తున్నారు. సంబంధిత భూములకు ప్రభుత్వం గెజిట్ రూపొందించింది. రైతులు భూముల్లో ఏడడుగులు మేర తవ్వకాలు చేపట్టి పైపులైన్లు ఏర్పాటు చేయనున్నారు. భూగర్భంలో నుంచే సరఫరా అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో జాయింట్ మెజర్‌మెంట్ సర్వే (జేఎంఎస్) నిర్వహిస్తున్నారు. జేఎంఎస్ సర్వేకు ముందుగా రైతులకు 3-1 నోటీసులను అందిస్తున్నారు. సర్వే పూర్తయిన తదుపరి 6-1 నోటీసును అందించనున్నారు. పైపులైన్‌కు అవసర మైన భూసేకరణకు గాను రైతులకు తగిన పరిహారం అందిస్తామని సర్వేయర్ కె.అప్పన్న తెలి పారు. ఈ భూసేకరణను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షిస్తాని వెల్లడించారు. సేకరించిన భూములు, సర్వే నెంబరు, సబ్ డివిజన్లను తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పరిశీలిస్తారని తెలిపారు.