ఉగ్రవాదుల దాడి అమానుషం
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:07 AM
కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగపడడం అమానుషమని ప్రభు త్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
- ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
గుమ్మలక్ష్మీపురం/వీరఘట్టం/బెలగాం, ఏప్రిల్ 24 (ఆంధ్ర జ్యోతి): కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగపడడం అమానుషమని ప్రభు త్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మృతుల కుటుంబాలకు సంఘీభావంగా గురువారం రాత్రి గుమ్మలక్ష్మీపురం, వీరఘట్టం, పార్వతీపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పో యిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. ఉగ్రవాదుల దాడులను ఖండించారు. ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో కేక్ కట్‌చేసుకుని సంబరాలు చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇద్దరు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ ర్యాలీలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బెలగాం: ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

వీరఘట్టం: కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జయకృష్ణ