fence కంచె వేసేశారు!
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:18 PM
They’ve put up a fence కొఠియా గ్రూప్ ఎగువశెంబి కత్తులకొండ వద్ద నిర్ధేశిత పొలాల్లో ఒడిశావాసులు శనివారం కంచె నిర్మాణం పూర్తి చేశారు. మైనింగ్ తవ్వకాల కోసం ఇదంతా చేస్తున్నారనే ఎగువశెంబి గిరిజనులు అభ్యంతరాలను బేఖాతరు చేస్తు ఒడిశా పోలీసుల భద్రతతో ఆ పనులు పూర్తి చేశారు.

గిరిజనులు అడ్డుకున్నా ఫలితం లేని వైనం
తహసీల్దార్‌కు ఫిర్యాదు
సాలూరు రూరల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కొఠియా గ్రూప్ ఎగువశెంబి కత్తులకొండ వద్ద నిర్ధేశిత పొలాల్లో ఒడిశావాసులు శనివారం కంచె నిర్మాణం పూర్తి చేశారు. మైనింగ్ తవ్వకాల కోసం ఇదంతా చేస్తున్నారనే ఎగువశెంబి గిరిజనులు అభ్యంతరాలను బేఖాతరు చేస్తు ఒడిశా పోలీసుల భద్రతతో ఆ పనులు పూర్తి చేశారు. కంచె ఏర్పాటుకు కొఠియా పరిసర గ్రామాల నుంచి కూలీలను రప్పించారు. తొలుత ఈ పనులను ఎగువశెంబి గిరిజనులు అడ్డుకున్నారు. అయితే ఒడిశా పోలీసులు ఇక్కడకి రావొద్దంటూ వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ సాగుభూములు తమవే అంటూ ఏపీ మంజూరు చేసిన ఆర్వోఎఫ్‌ఆర్ భూ పట్టాలు చూపినా ఆ రాష్ట్ర పోలీసులు పట్టించుకోలేదు. ఈ భూములు తమవే అంటూ ఒడిశావాసులు వాదించారు. ఇదే సమయంలో గిరిజనులు పోలీసులను ఫొటోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం వారు సాలూరు తహసీల్దార్ ఎన్వీ రమణకు ఫిర్యాదు చేశారు. తమ భూములకు రక్షణ కల్పించాలని కోరారు. ఒడిశా దౌర్జన్యంపై స్పందించాలని సీపీఎం నేత మర్రి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.