Share News

ట్రాక్టర్‌ బోల్తా: వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:58 PM

మండలంలోని గురువునాయుడు పేట నందేశ్వరాలయ సమీపంలో బుధవారం రాత్రి ట్రాక్టరు బోల్తా పడడంతో మాతుమూరుకు చెందిన మరిపెట్ల ఈశ్వరరావు (47) మృతి చెందాడు.

ట్రాక్టర్‌ బోల్తా: వ్యక్తి మృతి

పాచిపెంట, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గురువునాయుడు పేట నందేశ్వరాలయ సమీపంలో బుధవారం రాత్రి ట్రాక్టరు బోల్తా పడడంతో మాతుమూరుకు చెందిన మరిపెట్ల ఈశ్వరరావు (47) మృతి చెందాడు. పోలీ సులు, స్థానికుల కథనం మేరకు.. ఈశ్వరరావు ట్రాక్టరు రిపేరు కోసం బొబ్బిలి వెళ్లాడు. రిపేరు చేయించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా గురువునాయు డుపేట వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఈశ్వరరావు తలకు తీవ్ర మైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సింహాచలం ఫిర్యాదు మేరకు స్థానిక హెచ్‌సీ కృపారావు కేసు నమోదు చేశారు. ఈశ్వర రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలిం చారు. ఈశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె కవితకు వివా హం జరిగింది.

Updated Date - Apr 17 , 2025 | 11:58 PM