Share News

Unbearable Sorrow తీరని శోకం

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:28 PM

Unbearable Sorrow జమ్మూ కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసారన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకులపై హఠాత్తుగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో పార్వతీపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, లయన్స్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు బంపాడ చంద్రశేఖరరావు అల్లుడు చంద్రమౌళి (68) మృతి చెందారు. దీంతో జిల్లా కేంద్రంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Unbearable Sorrow  తీరని శోకం
చంద్రమౌళి (ఫైల్‌)

విషాదంలో కుటుంబ సభ్యులు

పార్వతీపురం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసారన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకులపై హఠాత్తుగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో పార్వతీపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, లయన్స్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు బంపాడ చంద్రశేఖరరావు అల్లుడు చంద్రమౌళి (68) మృతి చెందారు. దీంతో జిల్లా కేంద్రంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానిక స్టేట్‌బ్యాంకులో 1988-1996 వరకు సీనియర్‌ అకౌంటెంట్‌గా చంద్రమౌళి పనిచేశారు. బదిలీల అనంతరం మరికొన్నాళ్లు తిరిగి పార్వతీపురం ఎస్‌బీఐలోనే విధులు నిర్వర్తించారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం. చంద్రశేఖర్‌ కుమార్తె నాగమణిని ఆయన వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాఖపట్నంలో స్థిర నివాసం ఏర్పారచుకున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత చంద్రమౌళి ఏటా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పర్యాటక ప్రాంతాలను సంద ర్శిస్తుంటారు. దీనిలో భాగంగానే తన భార్య నాగమణి, మరో మూడు కుటుంబాలతో కలిసి ఆయన జమ్మూ కశ్మీర్‌కు వెళ్లారు. అయితే దురదృష్టవశాత్తూ ఉగ్రవాదుల దాడిలో చంద్రమౌళి మృతి చెందారు. కాగా ఈ ఘటనను తమ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని, తీవ్ర ఆవేదనకు గురవుతున్నామని చంద్రమౌళి బావమరిది బొంపాడ వాసు బుధవారం తెలిపారు.

Updated Date - Apr 23 , 2025 | 11:28 PM