ఇప్పటికీ మేమే మీతోడు!
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:21 AM
సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా.. ఖరీదైన ఏసీలు, కూలర్లు ఇళ్ల లోకి వచ్చి చేరుతున్నా.. సంప్రదాయ విసనకర్రలకు మా త్రం డిమాండ్ తగ్గలేదు.
జోరుగా విసనకర్రల అమ్మకాలు
రాజాం రూరల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా.. ఖరీదైన ఏసీలు, కూలర్లు ఇళ్ల లోకి వచ్చి చేరుతున్నా.. సంప్రదాయ విసనకర్రలకు మా త్రం డిమాండ్ తగ్గలేదు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతల సమయంలో ఇవి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. పట్టణాల్లోనూ ఇటీవల అనేక మంది చేతుల్లో ఇవి కని పిస్తున్నాయి. వీటితో పాటు కొవ్వొత్తులకూ డిమాండ్ పెరిగింది. రోజు రోజుకూ ఎండ తీవ్రమవుతుండడం... ఉద యం పది గంటల నుంచే వేడిగాలులు పెరుగుతుండడంతో పాటు విద్యుత్ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంత రాయంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు రూపా యికో.... రెండు రూపాయలకో దొరికిన విసనకర్ర ధర నేడు రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. కొవ్వొత్తుల ధరలూ కొండెక్కాయి. చిన్నపాటి ఆరు కొవ్వొత్తుల ప్యాకెట్ రూ.20 కాగా, పెద్దవి ఒక్కొక్కటి రూ.20 నుంచి రూ.50 వరకూ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.