ప్రతిభను ప్రోత్సహిస్తాం
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:14 AM
ప్రతిభ గల విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
ఎమ్మెల్యే విజయచంద్ర
బెలగాం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రతిభ గల విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 580పైగా మార్కులు సాధించిన పదో తరగతి విద్యా ర్థులకు, వారి తల్లిదండ్రులకు గురువారం పార్వతీపు రంలోని ఓ ప్రైవేటు కల్యాణమండపంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని 580 పైగా మా ర్కులు సాధించిన 16 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే రూ.5వేలు చొప్పున తన సొంత సొమ్మును ప్రోత్సాహకం గా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పది పరీక్షల్లో జిల్లా మూడో సారి మొదటి స్థానం సాధించడం అభినందనీయం అన్నారు. ఇన్‌చార్జి డీఈవో రమాజ్యోతి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భామిని: స్థానిక ఆదర్శ పాఠశాల విద్యార్థి గౌడు జగదీష్ ఇటీవల వచ్చిన పదో తరగతి ఫలితాల్లో 590 మార్కులు సాధించి భామిని మండల టాపర్‌గా, జిల్లాలో మూడో స్థానంలో నిలవడంతో ఇన్‌చార్జి డీఈవో రమా జ్యోతి విద్యార్థికి వారి తల్లిదండ్రుల సమక్షంలో గురువారం సత్కరించారు. అత్యధిక మార్కులు రావడంతో పాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం వల్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. ప్రిన్సిపాల్ రఘుపాత్రుని శివకుమార్, అధ్యాపకులు చుక్కా సంతోష్‌కుమార్, గంజి నాగమణి పాల్గొన్నారు.