Share News

పక్షులేం చేశాయి పాపం?

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:43 PM

దేవుదళ హైస్కూల్‌ ఆవరణలో గురువారం కొన్ని పక్షులు మృత్యువాత పడ్డాయి. ఉదయం పాఠశాల ఆవర ణలోని చెట్లపైకి పెద్ద సంఖ్యలో కాకులు చేరుకు న్నాయి.

పక్షులేం చేశాయి పాపం?
హైస్కూల్‌ ఆవరణలో పడి ఉన్న కాకులు

రేగిడి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): దేవుదళ హైస్కూల్‌ ఆవరణలో గురువారం కొన్ని పక్షులు మృత్యువాత పడ్డాయి. ఉదయం పాఠశాల ఆవర ణలోని చెట్లపైకి పెద్ద సంఖ్యలో కాకులు చేరుకు న్నాయి. కాసేపటికే వాటి లో కొన్ని ప్రాణాలు కోల్పో యి... కింద పడిపోయా యి. వీటిని గమనించిన విద్యార్థులు, ఉపాధ్యా యులు ఆందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న తోటలో కొంతమంది వేటగాళ్లు వీటిని పట్టుకొ నేందుకు విషంతో కూడిన ఆహారం పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ఆహారాన్ని తిన్న కాకులు ప్రాణాలు కోల్పోయాయి. పాఠశాల ఆవరణలోనే ఇవి మృత్యు వాత పడడంతో విద్యార్థులు భయంతో మధ్యాహ్న భోజనం చేయడానికి నిరాకరించినట్టు సమాచారం. పాఠశాలకు కొంత దూరంలో పావురాలు కూడా చనిపోయినట్టు స్థానికులు చెబుతు న్నారు. దీనికి విష ప్రయోగమే కారణంగా భావిస్తున్నారు. పక్షులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న స్థానికులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న వేటగాళ్లతో స్థానికులు, పాఠశాల సిబ్బంది వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. దీనిపై కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఎస్‌ఐ నీలావతి వద్ద ప్రస్తావించగా... కొన్ని పక్షులు స్పృహ తప్పి పడి ఉన్నట్టు తెలిసిందన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:43 PM