Share News

Will you not move until it all collapses? కూలితే గాని కదలరా?

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:34 PM

Will you not move until it all collapses? జిల్లాలో ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న మోడువారిన భారీ చెట్లు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడు ఏక్షణాన కూలుతాయో తెలియని పరిస్థితి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వాటిని ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు తొలగించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Will you not move until it all collapses?  కూలితే గాని కదలరా?
పాలకొండ: నవగాం జంక్షన్‌ వద్ద ఎండిన చెట్టు

  • పొంచి ఉన్న ప్రమాదం

  • ఆందోళనలో వాహనదారులు, స్థానికులు

  • పట్టించుకోని అధికారులు

పాలకొండ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న మోడువారిన భారీ చెట్లు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడు ఏక్షణాన కూలుతాయో తెలియని పరిస్థితి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వాటిని ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు తొలగించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎండిన చెట్లు కూలితే గాని పట్టించుకోరా? అని మండిపడుతున్నారు. జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం ప్రధాన రహదారుల్లో నిద్ర గన్నేరు చెట్లు పలు చోట్ల ఎండిపోయాయి. పార్వతీపురం, బొబ్బిలి ప్రధాన రహదారితో పాటు పార్వతీపురం, సాలూరు తదితర ఆర్‌అండ్‌బీ రహదారుల పక్కన మోడువారిన చెట్లు దర్శనమిస్తున్నాయి. వీటి కింద, సమీపంలో చిన్నపాటి ఇళ్లు, రేకుల షెడ్లు, కిరాణా దుకాణాలు ఉన్నాయి. మరోవైపు వాహనాలు, ప్రజల రాకపోకలతో ఆయా ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. ఈదురుగాలులకు ఇప్పటికే వాటి కొమ్ములు విరిగి కింద పడుతున్నాయి. ఆ సమయంలో చెట్టు కింద ఉండే వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పాలకొండలో ఆర్టీసీ షాపింగ్‌ మాల్‌కు ఆనుకొని ప్రధాన రహదారిపై ఎండిన చెట్టు కూలేందుకు సిద్ధంగా ఉంది. అది నేలకొరిగితే వ్యాపారులు, ప్రజలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. పాలకొండ, నవగాం జంక్షన్‌ వద్ద కూడా మరో భారీ వృక్షం ఎండిపోయి భయంగొల్పుతుంది. ప్రతి సోమవారం అక్కడే వారపు సంత జరుగు తుంది. వేలాది మంది క్రయ, విక్రయదారులతో పాటు నిత్యం ఆ జంక్షన్‌లో ఎంతోమంది సంచరి స్తుంటారు. వేసవి కాలంలో అకాల వర్షాలతో పాటు ఈదురుగాలల ప్రభావం అధికంగా ఉంటుంది. ఎండిన చెట్లు నేలకొరిగితే భారీ మూల్యం చెల్లించక తప్పదు. వాటి కింద ఉన్న కిరాణాషాపులు, వాహనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వాటిని తొలగించడం ద్వారా స్థానికులు, ప్రయాణిలను ప్రమాదాల బారి నుంచి బయటపడే అవకాశం అంటుంది.

పరిశీలిస్తాం...

ఆర్‌అండ్‌బీ రహదారుల పక్కన ఉన్న ఎండిన చెట్లపై స్థానికులు ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం. అటవీశాఖాధికారుల అనుమతి తీసుకొని వాటిని తొలగిస్తాం.

- కిరణ్‌కుమార్‌, జేఈ, ఆర్‌అండ్‌బీ

Updated Date - Apr 23 , 2025 | 11:34 PM