Share News

Won the toss... picked up the bat టాస్‌ వేసి.. బ్యాట్‌ పట్టి

ABN , Publish Date - Apr 18 , 2025 | 11:50 PM

Won the toss... picked up the bat యువత ఆటల ద్వారా క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. శ్యామలాంబ అమ్మవారి పండగను పురస్కరించుకుని సీనియర్‌ క్రికెటర్లు నిర్వహించిన టోర్నమెంట్‌ను ఆమె టాస్‌ వేసి ప్రారంభించారు.

Won the toss... picked up the bat టాస్‌ వేసి.. బ్యాట్‌ పట్టి
బ్యాట్‌ పట్టి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి సంధ్యారాణి

క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని సూచన

సాలూరు, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): యువత ఆటల ద్వారా క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. శ్యామలాంబ అమ్మవారి పండగను పురస్కరించుకుని సీనియర్‌ క్రికెటర్లు నిర్వహించిన టోర్నమెంట్‌ను ఆమె టాస్‌ వేసి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం బ్యాట్‌ పట్టుకుని తొలి బంతిని కొట్టారు. దీంతో ఆ ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. రానున్న శ్యామలంబ అమ్మవారి పండగకు యువత వలంటీర్లుగా సహాయం చేయాలని కోరారు.

ప్రతిభ ఆధారంగానే నియామకాలు

ప్రతిభ ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. శుక్రవారం సాలూరులోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఇటీవల అంగన్‌వాడీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. గత ప్రభుత్వంలో దళారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేదని, వారు నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని.. ఉద్యోగాలు ఇచ్చేవారు కాదని ఆరోపించారు. గతంలో ఇలా మోసపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో పైసా ఖర్చు లేకుండా కేవలం అర్హతను బట్టి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, మక్కువ మండల అధ్యక్షుడు వేణుగోపాలనాయుడు, ఏఎంసీ చైర్మన్‌ ముఖీ సూర్యనారాయణ, నాయ కులు యుగంధర్‌ , కార్యకర్తలు, ఐసీడీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 11:50 PM