Share News

టీడీపీ బలోపేతానికి పనిచేయండి

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:12 AM

టీడీపీ బలో పేతం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలన్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే సహించే ప్రశక్తేలేదని తెలిపారు.

 టీడీపీ బలోపేతానికి పనిచేయండి
మాట్లాడుతున్న సంధ్యారాణి

సాలూరు,ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): టీడీపీ బలో పేతం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలన్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే సహించే ప్రశక్తేలేదని తెలిపారు. బుధవారం మండలంలో ఎరగడవలస సమీపంలో ఓ తోటలో 29 పంచాయతీలకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,నాయకులుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ,పంచాయతీ,మండల స్థాయి కమిటీలు వేయాలని కోరారు. కార్యక్రమం లో టీడీపీ మండలాధ్యక్షుడు ఆముదాల పరమేష్‌, అక్కేన తిరుపతిరావు, బసవయ్య, మత్స శ్యాం, మరిపి సింహాచలం, డొంక అన్నపూర్ణ, అప్పికొండ రమాదేవి పాల్గొన్నారు.

ఫిర్యాదులపై స్పందించండి

ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని, అధికారులు సమన్వయంలో పని చేయలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రగతి, హరిత హారం, నీటి సరఫరా, పింఛన్లు, గృహనిర్మాణం, విద్యుత్‌, పాఠశాలలు ఆధునీకరణ పై దృష్టి పెట్టాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో పార్వతీ, తహసీల్దార్‌ రమణ పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:12 AM