33 నెలలుగా జీతాల్లేవ్!
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:14 AM
ఎర్రకాలువ ప్రాజెక్టు హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా ఏటా ప్రాజెక్టు నిర్వహ ణకు రూ.15 లక్షల వరకు నిధులు వచ్చేవి. ఆ నిధులతో ప్రాజె క్టు నిర్వహణ చేస్తూనే ఎన్‌ఎంఆర్ సిబ్బంది ఆరు గురికి జీతాలు సక్ర మంగానే ఇచ్చేవారు. 2022 ఆగస్టు నుంచి అప్పటి వైసీపీ ప్రభు త్వం నిధులను నిలిపి వేసింది. దీంతో దాదాపు 33 నెలల నుంచి ప్రాజెక్టు నిర్వహణకు నిధులూ లేవు, సిబ్బందికీ జీతాలు లేవు.
ఎర్రకాలువ జలాశయం (ఎన్‌ఎంఆర్) ఉద్యోగుల ఆవేదన
రూ.45 లక్షల జీతం బకాయిలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు నిలిపివేత
మరోవైపు వేధిస్తున్న సిబ్బంది కొరత
ఉండాల్సింది 25 మంది.. ఉన్నది ఆరుగురే
సమస్యలను పట్టించుకునే నాథుడే కరువు
జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) :
ముప్పైమూడువేల ఎకరాల ఆయకట్టు, నాలుగు వేల నాలుగు వందల టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, 53 కిలోమీటర్ల కుడి, ఎడమ ప్రధాన కాల్వలు, మూడు మండలాల పరిధిలోని పది వేల ఎకరాల ఆయకట్టు ఉన్న 290 ఎకరాల మైనర్ ఇరిగేషన్ చెరువులు.. వీటన్నింటినీ మెయింటైన్ చేయడానికి ఎంత మంది సిబ్బంది ఉన్నారో తెలుసా.. కేవలం ఆరుగురు నామినల్ మస్తర్ రోల్ (ఎన్‌ఎంఆర్) సిబ్బంది మాత్రమే అంటే నమ్ముతారా.. ఇంత పెద్ద ప్రాజెక్టులో రేయింబవళ్లు కష్టపడుతున్న ఆ ఆరుగురికి కనీసం ప్రతీ నెలా ఇచ్చే జీతం వస్తుందా.. అంటే అదీ లేదు. 33 నెలలుగా జీతాలు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటు న్నారు. కుటుంబాలను పోషించేందుకు అప్పుల పాలై రోడ్డున పడుతున్నారు.
జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలో శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం పరిధిలో పని చేయడానికి 2015లో అప్పటి ప్రభుత్వం వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా ఎం.సత్యనారాయణను రూ.18 వేల జీతా నికి, హెడ్ మజ్దూర్‌లుగా ఎస్.వీరేంద్ర, టి.అశోక్, డి.గాంధీలను రూ.16 వేల జీతానికి, వాచ్‌మెన్‌లుగా ఎస్.శేఖర్ బాబు,పి.లక్ష్మణ్‌లను రూ.15 వేల జీతానికి ఎన్‌ఎంఆర్‌లుగా విధుల్లోకి తీసుకుంది. గత పదేళ్లుగా వీరు అదే జీతానికి తమ ఉద్యోగ బాధ్య తలు నిర్వహి స్తున్నారు. ఎర్రకాలువ ప్రాజెక్టు హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా ఏటా ప్రాజెక్టు నిర్వహ ణకు రూ.15 లక్షల వరకు నిధులు వచ్చేవి. ఆ నిధులతో ప్రాజె క్టు నిర్వహణ చేస్తూనే ఎన్‌ఎంఆర్ సిబ్బంది ఆరు గురికి జీతాలు సక్ర మంగానే ఇచ్చేవారు. 2022 ఆగస్టు నుంచి అప్పటి వైసీపీ ప్రభు త్వం నిధులను నిలిపి వేసింది. దీంతో దాదాపు 33 నెలల నుంచి ప్రాజెక్టు నిర్వహణకు నిధులూ లేవు, సిబ్బందికీ జీతాలు లేవు.
ఆరుగురిపైనే భారం..
ఎర్రకాలువ ప్రాజెక్టు పరిధిలో 25 మంది సిబ్బంది పలు బాధ్యతలు నిర్వహించాల్సి ఉండగా వారందరి బాధ్య తలు ఈ ఆరుగురే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒక డీఈ, ఒక ఏఈ ఉండాల్సి ఉండగా ఇటీవల ఇక్క డ పనిచేసిన డీఈ రాంబాబు పదోన్నతిపై వెళ్ళారు. ప్రస్తుతం ఏఈ మాత్రమే ఇక్కడ ఉన్నారు. కొయ్యల గూడెం డీఈ రవీంద్ర ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈ ఇద్దరి ఇంజనీర్ల పరిధిలో డ్యామ్ సైట్ 25 మంది రెగ్యులర్ సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరు. ఎన్‌ఎంఆర్‌లుగా చేరిన ఆరుగురే అన్ని పనులు చేస్తూ ప్రాజెక్టును ఎప్పటికప్పుడు కాపాడుతున్నారు. ప్రాజెక్టు పనితో పాటు ఎస్టి మేట్లు తయారు చేయడం వంటి కార్యా లయ పనుల ను వీరే చేస్తున్నారు. వరదల సమ యంలో రాత్రింబవళ్ళు ప్రాణాలకు తెగించి ప్రాజె క్టు వద్ద పని చేస్తా మని, ఎన్నో సార్లు విష సర్పాల బారి నుంచి తృటిలో తప్పించుకున్నామని వారు పేర్కొంటు న్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి జీతం బకాయిలు ఇప్పించా లని, ప్రతీ నెల జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కుటుంబ పోషణకు అప్పులు ..
గత 33 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల్ని చదివించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పులు చేస్తున్నాం. వడ్డీలు చెల్లించకపోవడం వల్ల అప్పులు ఇచ్చిన వారు కార్యాలయానికి వచ్చి గొడవ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా దర్బార్‌లో మంత్రి లోకేశ్‌ను, పోలవరం ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతి పత్రాలు ఇచ్చాం. దాదాపు రూ.45 లక్షల వరకు మా జీతాలు రావాల్సి ఉంది.ఽ
– మల్లాది సత్యనారాయణ, వర్క్ ఇన్‌స్పెక్టర్