Share News

ఆక్వా రైతులకు అండగా..

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:10 AM

జగన్‌ ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే సమ స్యలను అధిగమించేందుకు ప్రభుత్వం జోన్‌, నాన్‌ ఆక్వాజోన్‌ సమస్య పరిష్కారానికి చర్య లు చేపట్టింది.

ఆక్వా రైతులకు అండగా..

పాతపద్ధతిలో.. ఆక్వాజోన్‌లోకి చెరువులు

రీసర్వే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు

30లోగా ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేయాలంటూ ఆదేశాలు

కైకలూరు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే సమ స్యలను అధిగమించేందుకు ప్రభుత్వం జోన్‌, నాన్‌ ఆక్వాజోన్‌ సమస్య పరిష్కారానికి చర్య లు చేపట్టింది. గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేతో ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. రైతులకు కొత్తగా ఎల్‌పీ నెంబర్లు ఏర్పాటు చేయడంతో ఆక్వా జోన్‌లోని చెరు వులు సైతం నాన్‌ ఆక్వాజోన్‌ పరిధిలోకి వెళ్ల డంతో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు రాకపోగా మత్స్యశాఖ అనుమతులు సైతం నిలిపివేశారు. ఈనెల 7న ‘రీసర్వే చిక్కులు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వెలువడిన కథనం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. సమస్యను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ లోపు అర్హత కలిగిన ఆక్వాజోన్‌ విస్తీర్ణాన్ని గుర్తించి ఆన్‌లైన్‌ చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించింది. రీసర్వే వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాలు చేపల, రొయ్యల చెరువులు ఆక్వాజోన్‌ నుంచి నాన్‌ ఆక్వాజోన్‌లోకి వెళ్లి పోగా ఒక్క కైకలూరు నియోజకవర్గంలో 50 వేల ఎకరాలు, ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదా వరి జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాలు నాన్‌ఆక్వాజోన్‌ పరిధిలోకి వెళ్లాయి.

ఈ సమస్యపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం ఆధారంగా ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, రాష్ట్ర చేపల రైతు సంఘం అధ్యక్షుడు తాడినాడ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందిస్తూ ప్రభుత్వం డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ కమిటీ చైర్మన్‌ అయిన జిల్లా కలెక్టర్‌ ద్వారా ఈ నెల 30వ తేదీ లోపు స్థానిక మత్స్యశాఖ అధికారుల నుంచి ఎల్‌పీ నెంబర్లు లేకుండా ప్రతీ రైతుకు ఆక్వాజోన్‌ అనుమతులు మంజూరు చేసేందుకు ఆన్‌లైన్‌ డేటా ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది. దీంతో పాత పద్ధతిలోనే ఆక్వాజోన్‌ పరిధి లోకి అన్ని చెరువులు వస్తాయి. దీనివల్ల రైతులకు మత్స్యశాఖ అనుమతులు ప్రభుత్వం నుంచి విద్యుత్‌ సబ్సిడీ, ఇతర పఽథకాలు యథావిధిగా రైతులకు అందనున్నాయి. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:10 AM