ప్లాస్టిక్ వాడకం తగ్గించండి : కలెక్టర్
ABN , Publish Date - Apr 20 , 2025 | 01:08 AM
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరోగ్యకర జీవన విధానానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కలెక్టర్ వెట్రి సెల్వి ప్రజలకు పిలుపు నిచ్చారు.
ఏలూరు టూటౌన్/ ఏలూరు, ఏప్రిల్ 19 (ఆంధ్ర జ్యోతి) : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరోగ్యకర జీవన విధానానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కలెక్టర్ వెట్రి సెల్వి ప్రజలకు పిలుపు నిచ్చారు. స్వర్ణాం రఽధ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కృష్ణకాలువ గట్లపై కలెక్టర్‌తో సహా మున్సిపల్ సిబ్బంది శ్రమదానం నిర్వ హించారు. పిచ్చిమొక్కలు, చెత్త, వ్యర్థాలను తొలగించడం, పరిసరాల పరిశుభ్రత నిర్వ హించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్య క్రమంలో ప్రజలు భాగస్వాములు కావాల న్నారు. ఎస్పీ కేపీఎస్ కిశోర్, జేసీ ధాత్రిరెడ్డి, కోఅప్షన్ సభ్యుడు పెదబాబు, డీఆర్వో విశ్వేశ్వరరావు, ఆర్డీవో అచ్యుత అంబరీష్, నగర కమిషనర్ భానుప్రతాప్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అలాగే స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో శనివారం కలెక్టర్ వెట్రిసెల్వి మొక్కలు నాటారు. ఈ–చెక్ థీమ్ కింద వివిధ శాఖల నుంచి ఎలక్ర్టానిక్ వ్యర్థాల ఏరివేతను కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు.