Share News

వైద్య రంగంలో సమూల మార్పులు తెస్తాం

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:43 AM

‘వచ్చే ఐదేళ్లలో వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొస్తాం. పేద, మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.

వైద్య రంగంలో సమూల మార్పులు తెస్తాం
పాలకొల్లులో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, డాక్టర్‌ రామానాయుడు తదితరులు

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌

పాలకొల్లులో డయాలసిస్‌ కేంద్రం ప్రారంభం

పాలకొల్లు టౌన్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ‘వచ్చే ఐదేళ్లలో వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొస్తాం. పేద, మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రాన్ని మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానా యుడుతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. అభి వృద్ధి, సంక్షేమానికి మంత్రి నిమ్మల చిరునామాగా ఉంటారని ప్రశంసించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, వార్డులను, నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి భవనాల ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. డయాలసిస్‌లో వున్న పేషం ట్లతో మాట్లాడారు. త్వరలో పాలకొల్లులోని వంద పడకల ఆసుపత్రి ప్రారంభంతోపాటు రెండేళ్లలో మెడికల్‌ కళాశాలను అందుబాటులోకి తీసుకుని వస్తామని తెలిపారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వైద్యసేవలకు చెల్లించాల్సిన రెండు వేల కోట్ల బకాయిల్లో రూ.1,300 కోట్ల వరకు ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించిందని తెలిపారు. ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, కలెక్టర్‌ నాగరాణి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌చార్జి అధికారి డాక్టర్‌ బి.భానునాయక్‌, డీసీహెచ్‌ డాక్టర్‌ పి.సూర్యనారాయణ, తహసిల్దార్‌ వై.దుర్గాకిషోర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బి.విజయ సారధి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు

Updated Date - Mar 15 , 2025 | 12:43 AM