మూడు మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:12 AM
జిల్లాలో ఏలూరు మండలంలో వివిధ కార ణాల రీత్యా ఏర్పాటు కాని మూడు మద్యం దుకాణాలకు లైసెన్సులను జారీ చేయడా నికి కలెక్టర్ ఆమోదంతో రీ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసినట్టు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్ ఆనాల ఆవులయ్య ఒక ప్రకటనలో తెలి పారు.
ఏలూరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఏలూరు మండలంలో వివిధ కార ణాల రీత్యా ఏర్పాటు కాని మూడు మద్యం దుకాణాలకు లైసెన్సులను జారీ చేయడా నికి కలెక్టర్ ఆమోదంతో రీ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసినట్టు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్ ఆనాల ఆవులయ్య ఒక ప్రకటనలో తెలి పారు. గత గెజిట్ ప్రకారం 23,24,26 షాపులకు మే నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దర ఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మే 4న దర ఖాస్తుల పరిశీలించి 5న ఉదయం 8 గంట లకు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీసి ఎంపికైన వారికి లైసెన్సులు జారీ చేస్తామన్నారు. ఎంపికైన వారు 2024– 2025 సంవత్సరానికి ఐదు నెలలు లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, అనంతరం 2025–26 సంవత్సరానికి పూర్తికాల లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మద్యం దుకాణాలకు ఏ ప్రాంతానికి చెందిన వారై నా రూ.2లక్షల దరఖాస్తు రుసుమును డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చలానా రూపంలో మద్య నిషేధ, అబ్కారీ జిల్లా అధికారి, ఏలూరు వారికి చెల్లుబాటు అయ్యేలా చెల్లించి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను జిల్లాలోని ఏడు ఎక్సైజ్ స్టేష న్లు ఏలూరు, భీమడోలు, చింతలపూడి, పోలవరం, బుట్టాయగూడెం, పోలవరం, జంగారెడ్డిగూడెం, కైకలూరు, నూజివీడుల్లో స్వీకరిస్తామని తెలిపారు.