నమస్తే సర్వే
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:41 AM
రోడ్లపై వ్యర్ధాలను ఎరుకునేవారిని గుర్తించి వారికి మెరుగైన జీవన విధానం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమస్తే (నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్‌డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) పథకంలో నమోదు కార్యక్రమాన్ని భీమవరం మునిసిపాల్టీలో సోమవారం చేపట్టారు.
చెత్త ఏరుకునే వారి వివరాల నమోదు
జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా భీమవరం
77 మంది సర్వే పూర్తి
భీమవరంటౌన్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): రోడ్లపై వ్యర్ధాలను ఎరుకునేవారిని గుర్తించి వారికి మెరుగైన జీవన విధానం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమస్తే (నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్‌డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) పథకంలో నమోదు కార్యక్రమాన్ని భీమవరం మునిసిపాల్టీలో సోమవారం చేపట్టారు. గతంలో అధికారులు గుర్తించిన 126 మందికి సమా చారం అందించారు. 82 మంది హాజరుకాగా ఆధార్ కార్డులల్లో వివరాలు సక్రమంగా లేకపోవడంతో 42 మంది వివరాలు నమోదు కాలేదు. 77 మంది వివరాలు నమోదు చేశారు. మరో రెండు రోజులు సర్వే కొనసాగుతుంది. సర్వేలో మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, సర్వే కోఆర్డినేటర్ వినయ్‌కుమార్, పర్యవేక్షకులు చిట్టిబాబు, తదితరులు ఉన్నారు.
వ్యర్థాలను ఏరుకునేవారిని గుర్తించడంతోపాటు ఏకీకరణను నిర్ధారించేందుకు వృత్తిపరమైన ఫోటో గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు.
వారికి భద్రత, శిక్షణ, నైపుణ్యం మెరుగదల, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ కిట్స్) అందిస్తారు.
ఈ–శ్రమ్‌లో నమోదు, ఆయుష్మాన్ భారత్ కింద వైద్య కవరేజీ నిర్దారించే ఆరోగ్య బీమా అదించే చర్యలు తీసుకుంటారు.
వ్యర్థాలను సేకరించే వాహనాలను కొనుగోలుకు అవసరమైన మూలధనం రాయితీ రూ.5లక్షల వరకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు.