గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:13 AM
గర్భిణులు ఆహారంలో జాగ్రత్తలు పాటించడం, పోషకాహారం తీసుకో వాలని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు.
ఆకివీడులో సామూహిక సీమంతం, అన్నప్రాసన
ఆకివీడు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): గర్భిణులు ఆహారంలో జాగ్రత్తలు పాటించడం, పోషకాహారం తీసుకో వాలని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పౌష్ఠికాహార పక్షోత్సవాల్లో భాగంగా గురువారం 20 మంది గర్భిణులకు సీమంతాలు, ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేశారు. గర్భిణులు మంచి ఆలోచనలతో ఉల్లాసంగా ఉంటే సుఖప్రసవాలు జరుగుతాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేశామ ని, ప్రసూతి వైద్యణులు లేకపోవడంతో ఉన్నతధికారులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ గర్భిణులు మంచి ఆ హారం తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంల సేవలు రానున్న తరానికి ఆదర్శమన్నారు.సినీ నటుడు రావూరి రమేశ్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చా లా సంతోషంగా ఉందన్నారు. ఐసీడీఎస్ పీడీ బి.సుజాతారాణి, పీవో వాణీ విజయరత్నం, సూపర్‌వైజర్ రత్నకుమారి, తహసీల్దార్ నండూరి వెంకటేశ్వరరావు, మోటుపల్లి రామవర ప్రసాద్, బొల్లా వెంకట్రావు, గొంట్లా గణపతి, బచ్చు సరళాకుమారి, నేతలు తదితరులు ఉన్నారు.